14, ఏప్రిల్ 2017, శుక్రవారం

నడక తప్పనిసరి

నడక తప్పనిసరి
******
నడక తప్పనిసరి
నడవకుండా
స్థాణువులా ఉండిపోతానంటే
చలనం లేకుండా
బండరాయిలా మిగిలిపోతానంటే
జీవితం ఊరుకోదు  !

కష్టాల కొరడా ఝుళిపించైనా
సుఖాల పల్లకిలో మోయించైనా
నడిపిస్తూనే ఉంటుంది !
సగం దారిలో ముళ్ళకంపలు
సగం దారిలో పూలపరదా
పువ్వుల కింద ముళ్ళు
ముళ్ళపైన  పూలు
నడక తప్పనిసరి !

నిన్ను నడిపించడంలో
జీవితం సర్వాధికారి !

చిటికెన వేలు  పట్టుకొని
దారిపొడవునా కాపలా కాస్తుంది
పాదాలు రెండూ పట్టుకొని
నిట్టనిలువునా కూలదోస్తుంది !
బెంబేలెత్తి ఆగిపోయిన మరుక్షణం
వెన్నెల అమృతాన్ని
కలశంలో పోసి తాగించనూ వచ్చు
అనల గరళాన్ని
దోసిటపోసి మింగించనూ  వచ్చు !

నీవు మాత్రం నిమిత్తమాత్రుడవని
ఊరుకుంటావా ..... ?!

విధినెదిరించైనా
విదాతను బెదిరించైనా
జీవితాన్ని సాదించాలి
పయనం సాగించాలి

నడక తప్పనిసరి !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి